జాతీయం (National) వార్తలు (News)

ఆత్రేయపురం పూతరేకుల పోస్టల్‌ కవర్‌ విడుదల?

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పూతరేకులపై భారత తపాలాశాఖ పోస్టల్‌ కవర్‌ విడుదల చేసింది. ఈ పోస్టల్‌ కవర్‌ను విశాఖ రీజియన్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ వెంకటేశ్వర్లు శనివారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రధాన తపాలా కార్యాలయాల్లో పూతరేకుల పోస్టల్‌ కవర్‌ అందుబాటులో ఉండగా ఈ పోస్టల్‌ కవర్‌ ధర ₹20లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న ఆత్రేయపురం పూతరేకుల తయారీపై దాదాపు 500 కుటుంబాలకు పైగా ఆధారపడి జీవిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •