వార్తలు (News)

వరంగల్‌ భద్రకాళి దేవస్థానం లో భక్తుల రద్దీ!!

శ్రావణమాసం సందర్భంగా అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా వరంగల్‌ భద్రకాళి దేవస్థానం శ్రావణమాసంలో నిర్వహించే వరలక్ష్మి వ్రతం పండగ శోభను సంతరించుకుంది. నిన్న వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరంగల్ లోని ఆలయాలన్నీ అందంగా ముస్తాబవ్వగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఓరుగల్లులోని ప్రతి ఇల్లు పండుగ శోభతో కళకళలాడుతోంది. నగరంలోని శ్రీ రాజరాజేశ్వరీ గుడి, పద్మాక్ధి దేవాలయం, సంతోషిమాత జ్ఞాన మందిరం, దత్తపీఠంలోని అనఘమహాలక్ష్మి ఆలయాల్లో వరలక్ష్మీవ్రతాలు జరిగాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •