రాజకీయం (Politics) వార్తలు (News)

కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొన్న పోలీసులకు కరోనా నిర్ధారణ?

హుజురాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన దళిత బంధు ప్రారంభోత్సవం కార్యక్రమానికి వెళ్లిన కొందరిలో కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు కానిస్టేబుళ్లకు పాజిటివ్ నిర్ధారణ అయింది.

కరోనా బారినపడిన ఈ ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా ఇటీవల హుజురాబాద్ సీఎం సభకు బందోబస్తు కోసం వెళ్లినట్టుగా తెలుస్తోంది. తిరిగి మెట్‌పల్లి వచ్చాక వీరు జ్వరం బారినపడడంతో అనుమానం వచ్చి టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని హోమ్ ఐసోలేష్‌కు పంపించారు. కానిస్టేబుళ్లతో దగ్గరగా మెలిగిన మిలిగినవారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •