ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

జబ్బుల గురించి ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారా??

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ అనేది ప్రతి ఇంటిలోనూ నిత్యావసరమైపోయింది. దీంతో చాలామంది వారికీ ఎలాంటి సమాచారం కావాలన్నది గురించి అంతర్జాలంలో వెతికి తెలుసుకుంటున్నారు. దీంతోనే అసలు సమస్య మొదలైంది. చాలామంది తమకున్న వ్యాధులు, లక్షణాలు మరియు ఇతర సమస్యల గురించి నెట్ లో సెర్చ్ చేయడం వల్ల వ్యాధులు మరింత ఎక్కువ అయ్యే అవకాశముందని డాక్టర్ లు ఆందోళన చెందుతున్నారు.

నెట్ లో వ్యాధుల గురించి వెతకడం వల్ల ఒక్కోసారి తప్పుడు సమాచారం లభించే అవకాశం ఉంది. అందుకే మనం వెతుకున్న సమాచారంలో ఎంతవరకు నిజం ఉంది అనేది పూర్తిగా తెలుసుకోవాలి. తప్పుడు సమాచారాన్ని ఫాలో అయితే మరింత అనారోగ్యం బారినపడే అవకాశముంది.

ఈ నెట్ లో రోగి తన సమస్యను వెతికే లక్షణాన్ని సైబర్‌కాండ్రియా అంటారు. ఉదాహరణకు, తలనొప్పి నివారణ కోసం మనం నెట్ లో సెర్చ్ చేస్తే అలసట నుంచి బ్రెయిన్ ట్యూమర్ వరకు ప్రతిదీ మనకు అందుబాటులోకి వస్తుంది. రోగి తనకున్న లక్షణాలను ట్యూమర్ గా భావిస్తే తీవ్ర సమస్యలు వస్తాయి. తనకు ట్యూమర్ సమస్య ఉందేమోననే కారణంగా రోగికి సరిగా నిద్ర ఉండదు. దాంతో రోగి సాధారణ సమస్యను మరింత తీవ్రమవుతుంది. రోగి తనకున్న సాధారణ దగ్గు లేదా నొప్పిని తీవ్రమైన అనారోగ్యంగా భావించి డాక్టర్ ను సంప్రదిస్తాడు. దాంతో డాక్టర్లు అనవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తారు. దీనివల్ల దానం తో పాటు మనశాంతి కూడా కరువవుతుంది.

సైబర్‌కాండ్రియాకు ఎలా ఎదుర్కోవాలి?
అనవసరమైన భయం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇంటర్నెట్‌లో లభించే సమాచారాన్ని ఫైనల్ గా పరిగణించవద్దు. నిపుణుల నుంచి సమాచారాన్ని తీసుకొని అందుబాటులో ఉండే వెబ్‌సైట్‌లలో మాత్రమే సమాచారాన్ని చూడాలి. మీకు ఏదైనా వ్యాధి లేదా లక్షణాలు ఉంటే నేరుగా డాక్టర్‌ని సంప్రదించడం మేలు. డాక్టర్ అనుమతి లేకుండా సొంత వైద్యం చేసుకొని అనారోగ్యం పాలుకావద్దు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •