అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల హస్తపరమైన నేపథ్యంలో మోడీ కామెంట్??

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు పైచేయి సాధించిన తరుణంలో.. తీవ్రవాద శక్తులు తమ ఉనికిని ఎల్లకాలం కాపాడుకోలేవని, వాటి మనుగడ స్వల్పకాలమే ఉంటుందని, మానవాళిని శాశ్వతంగా అణచివేయడం ఎవరికీ సాధ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్న నేపథ్యంలో యావత్ ప్రపంచం తర్వాతి పరిణామాలపై ఆందోళనలో ఉన్నాయి. ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధ్వంస, తీవ్రవాద శక్తులపై కీలక కామెంట్ చేస్తూ విధ్వంసక, తీవ్రవాద శక్తులు కొంతకాలమే మనుగడ సాధిస్తాయని అన్నారు. ఎక్కువ కాలం ఉనికిని కాపాడుకోలేవని, అనతికాలంలోనే పతనం కావాల్సిందేనని వివరించారు. ఇందుకు చారిత్రాత్మక సోమనాథ్ టెంపుల్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు.

సోమనాథ్ ఆలయాన్ని చాలా సార్లు ధ్వంసం చేశారు. పూర్తిగా వినాశనం చేయాలని, విగ్రహ సంపదను నేలమట్టం చేయాలని శతాబ్దాలపాటు ఈ విఫల ప్రయత్నాలు జరుగుతూనే వచ్చాయి. కానీ, ఈ ఆలయం కాలం పెట్టిన పరీక్షలను, కుటిల ప్రయత్నాలను జయించింది. ఇప్పటికీ నిలబడే ఉన్నది అని మోడీ అన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •