క్రైమ్ (Crime) వార్తలు (News)

చోరి కేసును చేధించి 27తులాల బంగారం, వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీస్ లు!!

ఖమ్మం రూరల్ వివిధ దొంగతనాల్లో నిందితులైన దొంగలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూరల్ ​మండల పోలీస్​స్టేషన్‌లో సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి శుక్రవారం ఉదయం సీఐ సత్యనారయణరెడ్డి, ఎస్ఐ శంకర్​రావు ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు నందు తనిఖీలు చేస్తుండగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను ఆధీనంలోకి తీసుకున్నారు. వారిని విచారించగా వీరు పలు పాత నేరాల్లో నిందితులని తెలినట్లు తెలిపారు. వీరు హైదరాబాద్‌లోని​చార్మినార్ ప్రాంతానికి చెందిన భరత్​కుమార్ శర్మ, గుంటూరుకు జిల్లాకు చెందిన తిరువీదుల మహేష్​అని గుర్తించినట్టు చెప్పారు.

వీరు పలు మార్లు పలు నేరాల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చి నిజామాబాద్, ఖమ్మం, కీసర ప్రాంతాల్లో ఇద్దరు కలిసి దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నట్లు, వీరి వద్ద నుండి 27తులాల బంగారం, వస్తువులు స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ సుమారు రూ. 14 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నిందితులను రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించి, కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •