వార్తలు (News)

ప్రమాదవశాత్తు కొండపైనుండి పడి పూజారి మృతి!!

అనంతపురం జిల్లా శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండ మీద విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి పూజారి పాపయ్య స్వామివారికి పూజలు చేస్తుండగా ప్రమాదవశాత్తు సుమారు 40 అడుగుల కిందకు జారిపడి మృతి చెందారు. ఎత్తైన కొండల మధ్య గంపమల్లయ్య స్వామి కొలువై ఉంటారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎలాంటి ఆధారం లేకుండా కొండపై నుంచి కిందకి దిగి పూజ చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ క్రమంలో పూజలు నిర్వహిస్తుండగా పూజారి ప్రమాదవశాత్తు కొండపై నుంచి పడి మృతి చెందడంతో అక్కడ విషాద ఛాయలు నెలకొన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •