అంతర్జాతీయం (International) వార్తలు (News)

శ్రీలంక లో పది రోజుల లాక్ డౌన్!!

కరోనా వైరస్‌ మూడో దశ ఉద్ధృతి కారణంగా శ్రీలంక భయభ్రాంతులకు లోనవుతుంది. వైరస్‌ ఉద్ధృతిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ నియంత్రణలోకి రాకపోవడంతో ఇక లాక్‌డౌనే శయనయం అని భావిస్తూ దేశవ్యాప్తంగా పదిరోజుల పాటు అంటే శుక్రవారం రాత్రి నుంచి ఆగస్టు 30వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించింది.

గతకొన్ని రోజులుగా శ్రీలంకలో నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆస్పత్రుల్లో చేరికలు పెరిగిపోయాయి. కేవలం గురువారం ఒక్కరోజే దాదాపు 4వేల కేసులు, 186 మరణాలు రికార్డయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం, శ్రీలంకలో ఇప్పటివరకు 3లక్షల 73వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 6790 మంది మృత్యువాతపడ్డారు. కొలంబోలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది.

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణతో ఆస్పత్రులు, మార్చురీలు, శ్మశాన వాటికలు కిటకిటలాడుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొన్నప్పటికీ అధ్యక్షుడు గోటబాయ మాత్రం కఠిన చర్యలకు నిరాకరించారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో దేశంలో రోజురోజుకి ఆరోగ్య వ్యవస్థ మరింత దిగజారిపోతుందని కూటమి సభ్యులతో పాటు అక్కడ అత్యంత శక్తివంతమైన బౌద్ధ మతాధికారుల నుంచి ఆందోళన వ్యక్తం అయ్యింది. వీటిని కట్టడి చేసేందుకు మరోసారి లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో తప్పని పరిస్థితుల్లో శ్రీలంక అధ్యక్షుడు లాక్‌డౌన్‌కు మొగ్గుచూపినట్లు సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •