టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

భారత సైనికుల చేతికి రానున్న అత్యాధునిక AK 200 రైఫిల్స్!!

భారత ప్రభుత్వం ఆయుధ రంగంలో ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ ఇప్పటివరకు భారత ఆయుధ రంగంలో కనీవిని ఎరుగని రీతిలో కొత్త ఆయుధాలను తయారు చేసి భారత ఆర్మీకి అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది.

తాజాగా 70 వేల ఏకే 200 సిరీస్ అసాల్ట్ రైఫిల్స్ సైన్యానికి అందించడం కోసం భారత్, రష్యా ఒప్పందం కుదుర్చుకున్నాయి. గతంలో 7 లక్షల ఏకే-203 రైఫిల్స్ ను సంయుక్తంగా తయారు చేయడానికి రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ, ఆ ఒప్పందం 2018 నుంచి ఇప్పటికీ పెండింగ్ లో ఉంది.

రక్షణ & భద్రతా వ్యవస్థ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. 7.62×39 మి.మీ ఏకే-203 రైఫిల్ లో 20,000ను నేరుగా దిగుమతి చేసుకుని, మిగిలిన వాటిలో 6.5 లక్షలను మన దేశంలో సంయుక్తంగా తయారు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించాయి. ఇక ఆఫ్-ది-షెల్ఫ్ ఎక్విప్ మెంట్ లో ఏకే 200 సిరీస్ లో చాలా వేరియెంట్స్ ఉండవచ్చు. రైఫిల్ తయారీ సంస్థ అయిన ఇండో-రష్యా రైఫిల్స్ ప్రయివేట్ లిమిటెడ్ కు చెందిన అధికారుల సమక్షంలో రక్షణ మంత్రిత్వ శాఖ, రష్యన్ ప్రతినిధుల మధ్య ఈ ఒప్పందంపై సంతకాలు జరుగగా ఈ రైఫిళ్లను ఈ ఏడాది నవంబర్ నుంచి సైనికులకు అంధించనున్నట్టు సమాచారం! ప్రస్తుతం సైన్యం, నావికాదళం, వైమానిక దళంలో వినియోగిస్తున్న 5.56×45 మి.మీ ఐ.ఎస్.ఎ.ఎస్ (ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్) రైఫిల్స్ స్థానంలో వీటిని భర్తీ చేయనున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •