అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంక్ కు అనుకోని ఆపద??

ఆఫ్ఘనిస్తాన్ ను సొంతం చేసుకున్న తాలిబాన్లు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే! ఎప్పుడు ఎటువంటి చర్యలకు పాల్పడుతారోనని ఆఫ్ఘన్ ప్రజలతోపాటు యావత్ ప్రపంచం అనుమానపడుతున్న వేళ ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంకుకు ఊహించని షాక్ తగిలింది. తమ దేశంలోని బ్యాంకుల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నిధులపై అమెరికా ఆంక్షలు విధించి దాదాపు 9.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను స్తంభింపజేసింది. తాలిబన్ల చేతిలో నిధులు దుర్వినియోగం అవుతాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్‌ బ్యాంకు (ద ఆఫ్ఘన్‌ బ్యాంక్‌)కు న్యూయార్క్‌ ఫెడరల్‌ రిజర్వు బ్యాంకు, అమెరికాలోని ఆర్థిక సంస్థల్లో దాదాపు 9.5బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులు ఉండగా కాబుల్‌ నగరాన్ని ఆదివారం తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ నిధులను స్తంభింపజేశారు. తాలిబన్‌ ప్రభుత్వం డబ్బును యాక్సిస్‌ చేయకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా అమెరికా నుంచి కాబుల్‌కు నగదు రవాణా కూడా నిలిచిపోయింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    130
    Shares
  • 130
  •  
  •  
  •  
  •