అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

చైనాకు షాక్ ఇచ్చిన అమెజాన్!!

అమెజాన్ సంస్థ చైనాకు భారీ షాక్ ఇస్తూ ఆ దేశానికి చెందిన 600 బ్రాండ్స్‌ను పర్మినెంట్‌గా బ్యాన్ చేసింది. ఇక మీదట ఆయా ఉత్పత్తులు అమెజాన్ సైట్‌లో అందుబాటులో ఉండవు. మొత్తం 600 బ్రాండ్స్‌లో, కొన్ని చైనాలోని పాపులర్ కంపెనీలు కూడా ఉండటం, చాలా మందిని షాక్‌కు గురిచేసింది.

చైనా బ్రాండ్స్‌పై అమెజాన్ అనూహ్య ఆగ్రహానికి కారణం వాటిని అమ్ముతోన్న కంపెనీల వ్యవహారశైలే! సదరు చైనీస్ సంస్థలు ప్రత్యేక గిఫ్ట్ కార్డ్స్ ఎరగా చూపుతూ వినియోగదారుల చేత పాజిటివ్ రివ్యూస్ రాయించుకుంటున్నాయి. ఈ విషయం అమెజాన్ దృష్టికి రావటంతో అలా చేయటం వారి నిబంధనలకు వ్యతిరేకం కావటంతో అమాంతం వేటు పాడడం.. చైనాకు వ్యతిరేకంగా తాము తీసుకున్న చర్య కాదని అమెజాన్ చెబుతోంది. ముందు ముందు ఏ దేశం బ్రాండ్స్‌కైనా రూల్స్ పాటించకపోయినా సెగ తప్పదని హెచ్చరిస్తోంది. అమెజాన్ లో నిషేధం కారణంగా చైనీస్ కంపెనీలు ఇప్పుడు ఈబే, అలీఎక్స్‌ప్రెస్ లాంటి ఈ కామర్స్ సంస్థల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •