వార్తలు (News)

సిటీ ఆఫ్ డెస్టినీ.. గంట వర్షానికే ప్రజల డెస్టినీ మార్చేలా!!

సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుపొంది స్మార్ట్ సిటీ గా అందరి మదిలో నగరమే విశాఖ నగరం! ఇంతవరకు బానే ఉంది. కానీ వాస్తవానికి వస్తే చినుకు పడితే చాలు వణుకుపుట్టే పరిస్థితి నగరంలోని చాలా చోట్ల కనిపిస్తుంది. ఆదివారం రాత్రి గంట పాటు కురిసిన వర్షానికి నగరంలోని మధురవాడలో హైవే పై నిర్మించిన బ్రిడ్జి కింద రహదారి నదిని తలపించేలా తయారై వరద ప్రవాహం కి రోడ్డుపై వెళ్లే వాహనాలు, వాహనదారులు కొట్టుకుపోయే పరిస్థితి కనిపించింది.

దీంతో ఆ ప్రాంతంలో కనిపించిన దృశ్యాలు ఏదో మారుమూల గ్రామాలలోనిదో లేదా ఏజెన్సీ ప్రాంతంలోనిదో అని భ్రమించేలా కనిపించింది. స్మార్ట్ సిటీగా, మెట్రోపాలిటన్ నగరంగా చెప్పుకునే, అదీ భూముల ధరలు అత్యధిక రేట్లు పలుకుతున్న మధురవాడ ప్రాంతంలో ఈ స్థితి నెలకొనడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక్కడ కాస్త చినుకు పడితే చాలు వణుకు పుడుతుందంటూ వాపోతున్నారు.

ఉన్నది రహదారో, లేక వాగో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుందని, ఆదివారం రాత్రి ఓ గంట పాటు కురిసిన వర్షానికే ఆ ప్రాంతం అతలాకుతలమైతే, కుండపోత వర్షం కురిస్తే మాపరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు నిట్టూరుస్తున్నారు విశాఖ వాసులు. బ్రిడ్జి కింద నుంచి బక్కన్నపాలెం వైపు ప్రయాణం అంటే ప్రాణసంకటంగా మారిందని వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో వర్షపు నీటి ప్రవాహంకి రోడ్డుపై ప్రయాణించే పలు వాహనాలు కొట్టుకుపోతుండడంతో వెంటనే స్థానికులు స్పందించి సహకారం అందించగా వాహనదారులు సేఫ్ గా బయటపడ్డారు. ఆ ప్రాంతంలో ఇటీవల కాలంలో భారీ నిర్మాణాలు ఉపందుకున్నాయి. ఆక్రమణల కారణంగా కాలువలు కుచించుకుపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినప్పటికీ అక్కడ ప్రయాణం సాహసోపేతంగా మారిపోతుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •