రాజకీయం (Politics) వార్తలు (News)

ధనవంతులకు ఉచిత బియ్యం కట్‌!!

రాష్ట్రంలో ఉచిత బియ్యం పొందుతున్న ధనవంతుల రేషన్‌కార్డులను తొలగించేందుకు ప్రజాపంపిణీ విభాగం అధికారులు ఇంటింటా రేషన్‌కార్డులను పరిశీలిస్తున్నారు. పరిశీలన అనంతరం ఉచితబియ్యం పొందటానికి అనర్హులుగా ఉన్న ధనవంతుల రేషన్‌ కార్డులను రద్దు చేసి, వారికి చక్కెర రేషన్‌ కార్డులను పంపిణీ చేయనున్నారు. రేషన్‌షాపులలో పేదలకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. దీనికితోడు ఉచిత బియ్యం, గోధుములను, తక్కువ ధరకు చక్కెర, కందిపప్పు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు కోట్ల మంది ఉచితబియ్యం, నిత్యావసర వస్తువులను పొందుతున్నారు.

నిరుపేదలకు ప్రతినెలా 20 కేజీల ఉచిత బియ్యం, అంత్యోదయ, అన్నయోజన పథకం కింద దారిద్య్రరేఖకు దిగువగా ఉన్న పేదలకు 35 కేజీల ఉచిత బియ్యం సరఫరా చేస్తుండగా ఈ పథకాల ద్వారా 18లక్షలమంది లబ్ధిపొందుతున్నారు. ఇటీవల ప్రజాపంపిణీ విభాగం అధికారులు జరిపిన పరిశీలనలలో ఈ ఉచిత బియ్యం పథకాల ద్వారా ధనవంతులు కూడా లబ్ధి పొందుతున్నట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బియ్యం పొందుతున్నవారి రేషన్‌ కార్డులను పరిశీలించడానికి సిద్ధమవుతున్నారు. ఇంటింటికీ వెళ్ళి రేషన్‌కార్డులను పరిశీలించి ఉచితబియ్యం పొందటానికి అనర్హులుగా ఉన్నవారి రేషన్‌ కార్డులను తొలగిస్తారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •