దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 10 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 5,326 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.47 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 453 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో 8,043 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.41 కోట్లు దాటింది. దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 79,097కి చేరింది. దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ప్రస్తుతం 160 కి చేరింది.