తెలంగాణలో 10 ఏళ్ల రికార్డును బద్దలుకొడుతూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కన్నా తక్కువ నమోదవడంతో స్థానికులు చలికి వణుకుతున్నారు.

ఈ పరిస్థితిలో గీజర్ అత్యవసరం అవడంతో కంపెనీలన్నీ ఆఫర్స్ అందిస్తున్నాయి. క్రాంప్టన్, బజాజ్, వీగార్డ్, హిండ్‌వేర్ లాంటి కంపెనీలన్నీ స్టోరేజ్, ఇన్‌స్టంట్ గీజర్లపై ఆఫర్స్ ప్రకటించాయి. ఈ గీజర్లన్నీ 3 లీటర్ల నుంచి 25 లీటర్ల కెపాసిటీతో వస్తున్నాయి. ఇద్దరు లేదా ముగ్గురు కుటుంబ సభ్యులు ఉంటే 10 నుంచి 15 లీటర్ల గీజర్ తీసుకుంటే చాలు. అంతకన్నా ఎక్కువ కుటుంబ సభ్యులు ఉంటే 25 లీటర్ల గీజర్ తీసుకోవాలి. మరి గీజర్లపై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో మీరు కూడా చూడండి..

HAVELLS 10 L Storage Water Geyser (Instanio): హ్యావెల్స్ 10 లీటర్ల స్టోరేజ్ వాటర్ గీజర్ ధర రూ.6,999. ఇందులో Incoloy గ్లాస్ కోటెడ్ హీటింగ్ ఎలిమెంట్ ఉంది. 10లీటర్ల గీజర్ కాబట్టి కిచెన్‌లో కూడా వాడుకోవచ్చు. ప్రొడక్ట్‌పై రెండేళ్లు, ఇన్నర్ కంటైనర్‌పై ఏడేళ్లు, హీటింగ్ ఎలిమెంట్‌పై నాలుగేళ్లు వారెంటీ లభిస్తుంది.

V-Guard 15 L Storage Water Geyser: వీగార్డ్ 15లీటర్ స్టోరేజ్ వాటర్ గీజర్ ధర రూ.6,500. ఇందులో Incoloy 800 హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది ఈ గీజర్ 8బార్ ప్రెజర్ కెపాసిటీతో వస్తుంది. కాబట్టి సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రొడక్ట్‌పై రెండేళ్లు, హీటింగ్ ఎలిమెంట్‌పై మూడేళ్లు, ట్యాంకుపై ఐదేళ్లు వారెంటీ లభిస్తుంది.

BAJAJ 15 L Storage Water Geyser: బజాజ్ 15లీటర్ స్టోరేజ్ వాటర్ గీజర్ ధర రూ.6,299. ఈ గీజర్ 8బార్ ప్రెజర్ కెపాసిటీతో వస్తుంది. వర్టికల్ డిజైన్ ఉంటుంది. థర్మోస్టాట్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి టెంపరేచర్ అడ్జెస్ట్ అవుతుంది. ప్రొడక్ట్‌కు ఒక ఏడాది, హీటింగ్ ఎలిమెంట్‌కు రెండేళ్లు, వాటర్ ట్యాంకుకు 5 ఏళ్లు వారెంటీ ఉంటుంది.

Ao Smith 25 L Storage Water Geyser: ఏఓ స్మిత్ 25లీటర్ స్టోరేజ్ గీజర్ ధర రూ.6,500. టెంపరేచర్ కంట్రోల్ నాబ్‌తో ఉష్ణోగ్రతను కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. ఇందులో కూడా 8బార్ ప్రెజర్ కెపాసిటీ ఉంటుంది. రెండేళ్ల కాంప్రహెన్సీవ్ వారెంటీ, ట్యాంకుపై ఏడేళ్ల వారెంటీ, హీటింగ్ ఎలిమెంట్‌పై మూడేళ్ల ఎక్స్‌టెండెడ్ వారెంటీ లభిస్తుంది.

CROMPTON 25 L Storage Water Geyser: క్రాంప్టన్ 25లీటర్ స్టోరేజ్ వాటర్ గీజర్ ధర రూ.6,599. ఇందులో సేఫ్టీ వాల్వ్, ట్విన్ ఇండికేటర్, షాక్ రెసిస్టెన్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ట్యాంకుపై ఏడేళ్ల వారెంటీ, హీటింగ్ ఎలిమెంట్‌పై రెండేళ్ల వారెంటీ, ప్రొడక్ట్‌పై రెండేళ్ల వారెంటీ లభిస్తుంది.

Hindware 25 L Storage Water Geyser: హిండ్‌వేర్ 25లీటర్ గీజర్ ధర రూ.5,499. వర్టికల్ డిజైన్‌తో వస్తుంది. కోరుకున్న టెంపరేచర్ వరకు నీళ్లు వేడికాగానే ఇన్‌స్టంట్ కటాఫ్‌తో గీజర్ ఆఫ్ అవుతుంది. ట్యాంకుకు ఐదేళ్ల వారెంటీ, మొత్తం రెండేళ్ల వారెంటీ లభిస్తుంది.

Hindware 3 L Instant Water Geyser: హిండ్‌వేర్ 3లీటర్ ఇన్‌స్టంట్ వాటర్ గీజర్ రూ.2,399 ధరకే లభిస్తోంది. ఇది స్టోరేజ్ గీజర్ కాదు. ఇది వర్టికల్ డిజైన్‌తో వస్తుంది. కారిసన్ రెసిస్టెంట్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారైంది. ట్యాంకుకు ఐదేళ్ల వారెంటీ, మొత్తం రెండేళ్ల వారెంటీ లభిస్తుంది.