కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ రోజురోజుకి పెరుగుతూ అన్ని దేశాలను వణికిస్తుంది. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఒమిక్రాన్ అంటేనే గజగజ వణుకుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. టెక్సాస్‌లో సోమవారం 50 ఏళ్లు పైబడిన ఒక వ్యక్తి మరణించినట్లు సమాచారం. కానీ మృతుడు కరోనా టీకా తీసుకోలేదని తెలుస్తోంది. అయితే ఈ మరణాన్ని యూఎస్ సీడీసీ ధ్రువీకరించాల్సి ఉంది.