అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు భారీ వర్షాలు, వరదల కారణంగా కొట్టుకుపోవడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం 48 మంది చనిపోయినట్లుగా తేలడంతో చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రూ. లక్ష చొప్పున సాయం ప్రకటించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలను చేపట్టింది.

ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్టీఆర్ ట్రస్ట్ బాధితుల కుటుంబ సభ్యులకు చెక్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. తిరుపతిలో జరగనున్న కార్యక్రమంలో రూ. 48 లక్షలను మృతుల కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరి పంపిణీ చేస్తారు. ప్రభుత్వం రూ. ఐదు లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది.