నిన్న ‘బేర్‌’ దెబ్బ నుండి కోలుకున్న దేశీయ మార్కెట్లు లాభాలతో ట్రేడింగ్ ను మొదలుపెట్టాయి. ఇవాళ ఉదయం 9.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 403 పాయింట్లు ఎగబాకి 56,226 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 118 పాయింట్ల లాభంతో 16,732 వద్ద ట్రేడవుతున్నాయి. సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, విప్రో, హిందాల్కో ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, శ్రీ సిమెంట్‌, సిప్లా, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి.