నిన్న భారీగా కుదేలైన దేశీయ మార్కెట్లు నేడు కాస్త కోలుకున్నాయి. ఒక దశలో భారీ లాభాల్లో దూసుకెళ్లినప్పటికీ మరల కాస్త తడబడి చివరకు లాభాల్లో కుదురుకున్నాయి. సెన్సెక్స్‌ 56,302 పాయింట్ల వద్ద మొదలై ఒక దశలో 1000 పాయింట్లకు పైగా లాభపడి 56,900 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకి చివరకు 497 పాయింట్లు లాభపడి 56,319 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ సైతం 16,688 – 16,936 పాయింట్ల వద్ద కదలాడి చివరకు 157 పాయింట్ల లాభంతో 16,771 వద్ద స్థిరపడింది.

నిఫ్టీలో విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, యూపీఎల్‌, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ముగిసాయి. ఇక యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, సిప్లా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు మాత్రం నష్టాలను చవిచూశాయి.