ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ కంపెనీ నుండి వన్ ప్లస్ ‘Nord 2 CE 5G’ స్మార్ట్ ఫోన్‌ను త్వరలో భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధం అవుతుంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా చుస్తే oneplus9 సిరీస్‌ను పోలి ఉంటుంది. పంచ్-హోల్ డిస్ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. Android 12 OxygenOS 12 పై పనిచేస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek డైమెన్సిటీ 900 చిప్‌సెట్‌తో 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో రానుంది

ఫోన్ వెనుక భాగంలో 64MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మాక్రో కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP కెమెరాను అమర్చారు. బ్యాటరీ సామర్థ్యం 4,500mAh. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. ధర రూ.28,000 గా నిర్ణయించే అవకాశం ఉంది.