గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుటకోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఓటీఎస్ ఎవ్వరూ కట్టవద్దని, టీడీపీ అధికారంలోకి రాగానే ఉచితంగా గృహ హక్కు కల్పిస్తామని ఆ పార్టీ నేత కోవెలమూడి రవీంద్ర అన్నారు. తక్షణమే ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పరిపాలన చేతగాని సీఎం తక్షణమే రాజీనామా చేయాలని కోవెలమూడి రవీంద్ర డిమాండ్ చేశారు.