వార్తలు (News)

రహదారి ప్రమాదంలో యువకుడి దుర్మరణం

వీరఘట్టం: కంబర గ్రామానికి చెందిన గుగ్గిలాపు దుర్గారావు(23) ఆదివారం విశాఖ జిల్లా తగరపువలస వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. యువకుడు తన కుటుంబ సభ్యులతో మూడేళ్ల కిందట విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంకు నివాసం మార్చాడు. అక్కడ ఒక హోటల్‌ నడిపేవాడు. కరోనా నేపథ్యంలో స్వగ్రామానికి చేరుకున్నాడు. నాలుగు నెలల కిందట విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం ఎర్రన్నగుడి వద్ద హోటల్‌ పెట్టుకున్నాడు. విశాఖపట్నంలో హోటల్‌ నిర్వహించిన షాపు అద్దె యజమానికి చెల్లించి సామాన్లు తీసుకుని తిరిగివస్తున్నాడు. సామాన్లు వ్యాన్‌పై ఎక్కించి ఆయన ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా తగరపువలస వద్ద లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కుటుంబాన్ని పోషిస్తున్న ఒక్కగానొక్క కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతే లేకుండా పోయింది. దుర్గారావుకు ఇద్దరు అక్కచెల్లెళ్లు కూడా ఉన్నారు. వారి బాధ్యత కూడా ఆయనే చూసుకునేవారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •