భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) 2020 తర్వాత నిర్వహించాలని తలపెట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

దీనిని 2022లో ప్రయోగించే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్‌ కే శివన్‌ తెలిపారు.

చంద్రయాన్‌-3, గగన్‌యాన్‌ సహా ఇస్రో చేపట్టిన పలు ప్రాజెక్టులపై కరోనా కారణంగా ప్రతికూల ప్రభావం పడిందని ఆయన వివరించారు