తెలుగులో దృశ్యం సినిమాలో నటించిన వెంకటేష్, మీనా దాని సీక్వెల్‌లోనూ నటించనున్నారు. విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్నారు వెంకటేష్‌ – మీనా. ‘చంటి’ మొదలుకొని అనేక చిత్రాల్లో కలిసి నటించి, విజయాల్ని సొంతం చేసుకున్నారు.చివరిగా ఈ జోడీ ‘దృశ్యం’తో సందడి చేసారు.. దానికి సీక్వెల్‌గా రానున్న ‘దృశ్యం 2’తో మరోసారి ఈ జోడీ తెరపై కనిపించనుంది.

మలయాళంలో ఇటీవలే విడుదలై విజయవంతమైన ‘దృశ్యం 2’ని, తెలుగులో రీమేక్‌ చేయనున్నారు.మాతృకని తెరకెక్కించిన జీతూజోసెఫ్‌ దర్శకత్వంలోనే సినిమా రూపొందనుంది.

మార్చి 1న ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టబోతున్నట్టు తెలిసిందని, మార్చి 5 నుంచి చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆ చిత్ర బృందం వెల్లడించింది.