దేశంలోనే తొలిసారిగా రేడియల్ గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక.అనుకున్న స‌మ‌యానికి ప్రాజెక్టు పూర్తి చేయ‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కృషి చేస్తుంది.రాత్రింబ‌వ‌ళ్లు ప‌నుల‌ను జ‌ల‌వ‌న‌రుల‌శాఖ అధికారులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.
రికార్డు వేగంతో మేఘ ఇంజినీరింగ్ సంస్థ‌ ప‌నులు పూర్తి చేసుకుపోతున్నది. జర్మనీకి చెందిన మౌంట్ హైడ్రాలిక్ సంస్ద నుండి భారీ సిలిండర్ల దిగుమతి చేసుకున్నారు. సిలిండ‌ర్లు అమ‌ర్చేందుకు మౌంట్ హైడ్రాలిక్ ఇంజనీర్లు పోలవరం చేరుకున్నారు.


పోలవరం ప్రాజెక్టులో హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక ఆరంభం విజయవంతంగా ముగిసింది. మొదటి హైడ్రాలిక్ సిలిండర్ అమరిక పూర్తి అయింది. ఒక్కో గేటుకు 2 హైడ్రాలిక్ సిలిండర్లు ఉంటాయి. 48 గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చనున్నారు.
ఒక్కో హైడ్రాలిక్ సిలిండర్ దాదాపుగా 20 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది.
ఒక్కో హైడ్రాలిక్ సిలిండర్ పొడవు 17.308 మీటర్లు ఉంది.హైడ్రాలిక్ టెక్నాలజీతో గేట్లను ఎత్తడం దేశంలోనే పొల‌వ‌రంలో మొదటిసారి జరగనుంది.హైడ్రాలిక్ సిలిండర్ల సాయంతో నిమిషానికి అరమీటరు చొప్పున గేటును ఎత్తుతారు.పోలవరం ప్రాజెక్టు రేడియల్ గేట్లుకు 24 పవర్ ప్యాక్ సెట్లు.ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో రెండు గేట్లును ఎత్తవచ్చు.ప‌వ‌ర్ ప్యాక్ రూం మేఘా సంస్థ‌ ఏర్పాటు చేసింది.ఇప్పటికే స్పిల్ వే పిల్లర్లపై 192 గడ్డర్లు అమరిక పూర్తి అయింది.గడ్డర్లు పని పూర్తికావడంతో గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చే పనులు ప్రారంభం అయ్యాయి.