నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అసోంలో పర్యటించారు.ఈశాన్య రాష్ట్రాలపై గత ప్రభుత్వాలు సవతి ప్రేమ చూపించాయని ఆయన విమర్శించారు. . రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు.

‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలపై సవతి ప్రేమ చూపించింది. అనుసంధానం, విద్య, వైద్యం, పరిశ్రమలు ఇలా ఎన్నో అంశాలను నిర్లక్ష్యం చేసింది. దిల్లీకి దిస్పూర్‌ చాలా దూరంలో ఉందని గత ప్రభుత్వాలు భావించాయి. కానీ ఇప్పుడు అసోంకు దిల్లీ దూరం కాదు. మీ గడప ముందరే ఉంది’’ అని అన్నారు. అసోం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమతూకంతో పనిచేస్తున్నాయని ప్రధాని తెలిపారు.

పర్యటనలో భాగంగా రూ. 3,300 కోట్ల పెట్రోలియం ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. దేమాజీ, సువాల్‌కుచిలో నిర్మించనున్న ఇంజినీరింగ్‌ కళాశాలలకు శంకుస్థాపన చేశారు. అసోం పర్యటన తర్వాత మోదీ అక్కడి నుంచి నేరుగా పశ్చిమబెంగాల్‌ వెళ్లనున్నారు.