విలీన మండలాల్లో 108 వాహనం విషయంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఎవరికైనా సుస్తీచేసి, అత్యవసరంగా ఆసుపత్రికి తరలించేందుకు 108 నంబరుకు ఫోన్‌ చేస్తే తెలంగాణలోని సంబంధిత కార్యాలయాలకు వెళ్తోంది. దాంతో వారు మీది ఆంధ్రా ప్రాంతం, అక్కడకు కాల్‌ చేయండి అంటూ సలహా ఇచ్చి ఫోన్‌ పెట్టేస్తున్నారు. ఎందుకిలా జరుగుతోందంటే.. గతంలో సమాచార వ్యవస్థపరంగా ఈ మండలాలు తెలంగాణ రీజియన్‌లో ఉండేవి. ఇక్కడి సెల్‌టవర్లు, తెలంగాణ పట్టణాలతో అనుసంధానం చేయడంతో ఈ సాంకేతిక లోపం తలెత్తుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కుక్కునూరు మండలంలో అత్యవసరమైన వారు ఇక నుంచి 108కు కాకుండా, 83310 33253కు ఫోన్‌ చేయాల్సిందిగా 108 సిబ్బంది సూచించారు.