ఒడిశాలో భూమిలో అమర్చిన మందుపాతర​ పేలి సరిహద్దు భద్రతా దళ(బీఎస్​ఎఫ్)​ జవాన్​​ తీవ్రంగా గాయపడ్డారు.

మల్కాన్​ గిరి జిల్లా మథిలీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గుగపాదర్​లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది.

ప్రమాదంలో గాయపడ్డ సైనికుడిని చికిత్స కోసం హెలికాప్టర్​ ద్వారా రాయ్​పుర్​కు తరలించారు.

ఈ మేరకు బీఎస్​ఎఫ్​ అసిస్టెంట్​ కమాండెంట్​ విజయ్​పాల్​ సింగ్​ తెలిపారు.