మధ్యప్రదేశ్‌లోని సహదోల్‌ జిల్లాలో ఓ యువతి (20)పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల పాటు నరకం చూపించారు. నిందితుల్లో జైత్‌పుర్‌ మండల భాజపా నేత విజయ్‌ త్రిపాఠీ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాహనంపై వచ్చిన నలుగురూ ఆమెను అపహరించి గడఘాట్‌ ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు. ఆమెతో బలవంతంగా మద్యం తాగించి.. రెండు రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేసి దారుణానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను ఇంటి ముందు వదిలేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు అదనపు ఎస్పీ ముఖేశ్‌ వైశ్‌ తెలిపారు. కాగా త్రిపాఠీని వెంటనే పార్టీ నుంచి తొలగించినట్లు భాజపా ప్రకటించింది.