ఆదివారంనాడు నాలుగో విడతలో అత్యధికంగా 85.64శాతం మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు. నాలుగు విడతల్లో పంచాయతీ పోరుకు మొత్తం 84.97శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం చివరి విడతలో కొన్ని ప్రాంతాల్లో స్వల్ఫఘటనలు చోటుచేసుకున్నాయి. ఉదయమే ఎక్కువ మంది పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారు. ఎ.కొండూరు మండలం రామచంద్రాపురంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. గన్నవరం నియోజకర్గంలో ఉద్రిక్త పరిస్థితిని గమనించిన పోలీసులు భారీగా మోహరించడంతో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. డివిజనులో మొత్తం 288 పంచాయతీలు ఉండగా 13 ఏకగ్రీవం అయ్యాయి. 275 సర్పంచి పదవులకు ఎన్నికలు జరిగాయి. డివిజనులో మొత్తం 6,39,888 మంది ఓటర్లు ఉండగా 548025 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆగిరిపల్లిలో అత్యధికంగా 90.13 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ముందు జాగ్రత్త చర్యల వల్లే పోలింగ్‌ సజావుగా సాగిందని కలెక్టరు ఇంతియాజ్‌ ‘ఈనాడు’తో అన్నారు. 

ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. 

కాటూరు: ఓటేశామంటూ…
ఉయ్యూరు మండలం ఆనందపురంలో ఓ వృద్ధురాలిని ఓటేయించడానికి తీసుకెళ్తూ..
బాపులపాడు: జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు
బాపులపాడు: దివ్యాంగునికి సహాయం చేస్తున్న పోలీసులు

Source