చెన్నై పిచ్ పై వచ్చిన విమర్శల నేపథ్యం లో టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు.దీనిపై ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ స్పందించారు.ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో పిచ్ సరిగా లేదని,ఆతిథ్య జట్టుకు అనుకూలంగా ఉందని వాన్ తో సహా పలువురు మాజీలు తీవ్ర వ్యాఖ్యలు చేసారు.దీనిపై పెద్ద చర్చ జరగడంతో టీం ఇండియా ఓపెనర్ ఆదివారం మీడియా తో మాట్లాడుతూ జవాబు ఇచ్చారు.పిచ్ ల గురించి కాకుండా ఆటగాళ్ల ప్రదర్శనపై మాట్లాడాలంటూ రోహిత్ సూచించారు.రెండు జట్లకు పిచ్ సమానమే అని మెరుగ్గా ఆడినవాళ్లు మాత్రమే గెలుస్తారని స్పష్టం చేసారు.
పిచ్ ల విషయం లో ఎందుకింత చర్చ జరుగుతుందో అర్ధం కావట్లేదు,ప్రతి ఒక్కరు ఇదొక పెద్ద విషయంగా దీని గురించి చర్చిస్తున్నారు.చాలాకాలంగా భారత్ పిచ్ ల స్వభావం ఇలాగె ఉంది.అందులో మార్పు రావాలని మాత్రం అనుకోవడం లేదు.స్థానిక పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని ప్రతి జట్టు కోరుకుంటుంది.ఇతర దేశాలకు వెలికినప్పుడు మాగురించి ఎవరు ఆలోచించారు అని,అలాంటప్పుడు ఇతర జట్ల గురించి మేము మాత్రం ఎందుకు ఆలోచించాలని సొంత గడ్డపై సానుకూలత అంటే అదే అని రోహిత్ అన్నారు. ఆలా ఉండకూడదనిపిస్తే ఎక్కడైనా సరే పిచ్ లన్ని ఒకేలా ఉండాలని ఐసిసి నిబంధనల్ని రూపొందించాలి.మేము విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రజల వ్యవహార శైలి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందని అలాంటిప్పుడు పిత్చా ల గురించి ఆలోచించవలసిన అవసరమే లేదని రోహిత్ చెప్పారు.
అలాగే ఆటగాళ్ల ప్రదర్శనలపై చర్చలు జరగాలని, బ్యాటింగ్,బౌలింగ్ ఎలా చేస్తున్నారో చర్చించాలి కానీ హిట్మాన్ సూచించారు.రెండు జట్లు ఒకే పిచ్పి ఆడతాయి అని,మెరుగ్గా ఆడిన జట్టే గెలుస్తుందని అన్నారు.టీం ఇండియా పిచ్ గురించి ఎప్పుడు ఆలోచించడాన్ని,ఎక్కువ ఆలోచించినంత మాత్రాన పిచ్ లు మారవని అన్నారు.ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్ లు జరిగి చాల రోజులు ఇంద్రాణి పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలని రోహిత్ అన్నారు.మరొక వైపు చెన్నై పిచ్ ఫై స్పందించిన ఇంగ్లాండ్ స్టువర్ట్ బ్రాడ్ స్వదేశం లో ఆడే జట్టుకు అక్కడి పరిస్థితులను సద్వినియోగం చేసుకునే సానుకూలత మరియు హక్కు ఉంటుందని అందులో తప్పు లేదని ఇంగ్లాండ్ జట్టు కూడా ఆలా ఆలోచించాడు అని రోహిత్ స్పష్టం చేసారు.