ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టులో క్లారిటీ వచ్చాకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలంటూ వ్యాఖ్యలు చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాల పిటిషన్ రేపు కోర్టులో విచారణకు రానుంది. రేపు పూర్తి క్లారిటీ రాకుంటే ఎన్నికలు మరింత జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు ఎస్ఈసీ, ప్రభుత్వం సిద్ధమౌతున్నాయి. కాసేపట్లో సీఎస్, డీజీపీలతో కలిసి ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సాయంత్రం గవర్నర్ తో ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ కానున్నారు