ఎస్ ఈసీ నిమ్మగడ్డ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల గురించి ముచ్చటించారు

ఎన్నికలలో అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా జరగలేదు అని, అన్ని వర్గాల వారూ సంయమనంతో ఉండటంతోనే ఇది సాధ్యపడింది అని, 13,097 స్ధానాలకు ఎన్నికలు అయితే 16% మాత్రమే ఏకగ్రీవం అయ్యాయని, 10,890 మంది సర్పంచులు నేరుగా పోటీ చేసి ఎన్నికయ్యారని, 50% మంది మహిళలు, బలహీనవర్గాల వారు ఉన్నారని, గెలిచిన వారి వల్ల మెరుగైన నాయకత్వం వ్యవస్ధకు వస్తుందని ఎస్ఈసీ ఆశిస్తోందని, పోలీసు సిబ్బంది వ్యాక్సినేషన్ పక్కన పెట్టి పనిచేసారని, 80% కంటే ఎక్కువ మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని, ఆరోగ్యశాఖ కోవిడ్ నేపధ్యంలో చక్కని ఏర్పాట్లు చేసారని, డీజీపీ, సీఎస్ కూడా సమయానుకూలంగా సూచనలిస్తూ పనిచేసారని వివరించారు.

కోర్టు అవరోధాలు కూడా తొలిగిపోతే, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా ప్రభుత్వంతో సంప్రదించి నిర్వహిస్తాం అని,మునిసిపల్ ఎన్నికలలో పట్టణ ఓటటర్లు కచ్చితంగా ఓటు వినియోగించుకుంటారని ఆశిస్తున్నామని, ఉదయం 7 నుంచి సాయoత్రం 5 వరకూ మునిసిపల్ పోలింగ్ ఉందని, ఇవాళ డీజీపీ, సీఎస్ ల సమక్షంలో కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరగనుందని,నామినేషన్ వేయలేకపోయిన వారు రుజువులతో సహా కలెక్టర్లను సంప్రదిస్తే నామినేషన్ స్వీకరిస్తారని అన్నారు.