పార్లమెంట్‌ సభ్యుడు మోహన్‌ దేల్కర్‌ అనుమానాస్పద స్థితిలో మరణించారు. దక్షిణ ముంబయిలోని ఓ హోటల్‌లో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంపీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
మోహన్‌ దాద్రా నగర్‌ హవేలీ స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాద్రా నగర్‌ హవేలీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న ఆయన 2019లో పార్టీని వీడారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ స్థానం నుంచి ఆయన ఏడు సార్లు ఎంపీగా గెలుపొందారు. మోహన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు