తమను రానివ్వకపోతే టీ20 ప్రపంచ కప్ 2021 భారత్‌లో జరగకుండా చూస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహసాన్ మని అన్నారు. తమ ఆటగాళ్లకు, ఫ్యాన్స్‌కు, జర్నలిస్టులకు అందరికీ ఇండియా వీసాలివ్వాలని, అలా అని ముందుగా రాతపూర్వకమైన భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్చిలోగా ఈ రాతప్రతిని అందజేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అందుకు భారత్ ఒప్పుకోకపోతే అప్పుడు టోర్నీనే భారత్‌లో జరగకుండా ఉండేలా ప్రయత్నిస్తామని, యూఏఈలో నిర్వహించాలని ఐసీసీని కోరతామని చెప్పారు. ‘ఇప్పటికే ఐసీసీకి ఈ విషయంపై మా వాదన వినిపించాం. మార్చిలోగా వీసాలకు సంబంధించి భారత్ భరోసా ఇవ్వాలని కోరాం’ అంటూ మని చెప్పుకొచ్చారు.