మంగళవారం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. రేపు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు ప్రధాన ఎజెండాగా కేబినెట్‌లో చర్చిస్తారని చెబుతున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టి పలు బిల్లులను కూడా మంత్రివర్గం ఆమోదించనుంది. తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంపైనా చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన హామీలు, ఉద్యోగుల పంపకం, తదితర అంశాలపై.. రాష్ట్ర ప్రభుత్వ వాదనను ఎలా ఉండాలనే దానిపై కేబినెట్‌లో చర్చకు అవకాశం ఉంది. విశాఖ ఉక్కు, కార్మికుల ఉద్యమం, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించే అవకాశం ఉంది.