పత్రికా సమాచార కార్యాలయం ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం తెలుగు వెబ్ ఎడిటర్స్ నియామకాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ప్రాంతీయ వార్తా విభాగం, తాత్కాలిక ప్రాతిపదికన పని చేసేందుకు వెబ్-ఎడిటర్స్ (తెలుగు) కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. హైదరాబాద్ నగరపాలక సంస్థ, జి.హెచ్.ఎమ్.సి పరిధిలో నివసించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రాక్టికల్స్ తో కూడిన రాత పరీక్ష అనంతరం – ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్ధులు, వివరాల కోసం www.newsonair.com వెబ్ సైట్ లో ‘‘వేకెన్సీ’’ ట్యాబ్ ను చూడగలరు. దరఖాస్తులను 2021 మార్చి 1వ తేదీ, సాయంత్రం 5 గంటల లోగా అందేలా పంపాలి.