తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 30 శాతం ఫిట్ మెంట్ అందిస్తున్నట్లు, పీఆర్సీతో పాటు రిటైర్మెంట్ వయో పరిమితిని 61 ఏళ్లకు పెంచుతున్నట్లు శుభవార్త చెప్పారు. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయని, దీనితో 9.17 లక్షల మందికి లబ్ధిచేకూరనుంది. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నామని, నిర్ణయం కూడా తక్షణం అమల్లోకి వస్తుందనీ, అర్హులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లను కూడా ఇవ్వనున్నామనీ సీఎం కేసీఆర్ తెలిపారు. టీచర్ల అంతర్ రాష్ట్ర ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్, సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యాపీలీ పెన్షన్ ఇవ్వనున్నట్లు, రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రిలీవ్ ఇవ్వనున్నట్లు చెప్పారు.