వార్తలు (News)

ఆపిల్ కంపెనీకి ₹15 కోట్ల ఫైన్‌!

పర్యావరణ హితం పేరుతో ఐఫోన్ 12 సిరీస్ ను ఆపిల్ మొబైల్‌ కంపెనీ ఛార్జర్‌ లేకుండా మొబైల్‌ను విక్రయిస్తున్నందుకు అక్కడి వినియోగదారుల ఫోరం (ప్రోకాన్‌-ఎస్పీ) సుమారు ₹15 కోట్ల (2 మిలియన్‌ డాలర్లు) జరిమానా విధించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించి ఛార్జర్‌ లేని మొబైల్‌ను విక్రయించినందుకు గానూ ఈ జరిమానా విధిస్తున్నట్లు ఫోరం వెల్లడించింది. ‘‘చట్టాలు, నియమాలకు లోబడి కంపెనీలు పరికరాలను అందుబాటులోకి తీసుకురాని పక్షంలో దేశంలో వినియోగదారుల చట్టాలు చాలా కఠినంగా మారతాయనే విషయం ఆపిల్ అర్థం చేసుకోవాలి’’ అని ప్రోకాన్‌ ఎస్పీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ ఫెర్నాండో కాపెజ్ పేర్కొన్నారు.

ఐఫోన్‌ 12 మినీ ధర యూఎస్‌లో 729 డాలర్లు ఉండగా బ్రెజిల్‌లో 1200 డాలర్లకు విక్రయిస్తోంది. ఈ క్రమంలో ఫోన్‌కు ఛార్జర్‌, హెడ్‌ సెట్‌ ఇవ్వకపోవడంతో వినియోగదారులు నష్టపోతున్నారని బ్రెజిల్‌ వినియోగదారుల ఫోరం యాపిల్‌కు రెండు మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. అయితే, వినియోగదారులు ఎక్కువగా వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ పద్ధతిని అనుసరిస్తున్నారని, ఫోన్‌లకు ఛార్జర్‌ ఇవ్వడం వృథా అనిపిస్తోందని, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆపిల్ వీపీ లీసా జాక్సన్ గతంలో‌ అభిప్రాయపడ్డారు. ఛార్జర్‌ ఇవ్వకుండా ఫోన్‌ విక్రయించడం సమంజసం కాదంటూనే, ధర ఎందుకు తగ్గించడం లేదని వినియోగదారుల ఫోరం ప్రశ్నించింది. దీనిపై ఆపిల్‌ ఇంకా స్పందించలేదు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.