టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఎస్‌5 స్పోర్ట్‌బ్యాక్‌ కారు

మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూలో కొన్ని మోడల్స్ కార్లకు పోటీగా ఆడీ భారత్‌లో కొత్త ఎస్‌5 స్పోర్ట్‌బ్యాక్‌ కారును సోమవారం విడుదల చేసింది. లగ్జరీ సెడాన్‌ సెగ్మెంట్‌లో వస్తున్న ఈ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ధరను రూ.79.06 లక్షలుగా (ఎక్స్‌షోరూం) నిర్ణయించారు. ఎస్‌5 స్పోర్ట్‌ బ్యాక్‌ను 2017లోనే భారత్‌కు తీసుకొచ్చారు కానీ దానికి ఔటర్‌ డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, మరిన్ని అత్యాధునిక ఫీచర్లు జోడించారు. యాంగులర్‌ బంపర్‌, క్వాడ్‌ టిప్‌ ఎగ్జాస్ట్‌లు, 19 అంగుళాల అలాయ్ వీల్స్‌, స్పాయిలర్‌తో ఆకట్టుకోవడంతో పాటు షార్పర్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్‌లు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

పది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ తెర, 12.2 అంగుళాల డిజిటల్‌ ఎంఐడీ తెర, ఫ్లాట్‌ బాటమ్‌ స్టీరింగ్ వీల్‌తో పాటు 3.0 ట్విన్‌ టర్బో, వీ6 పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్ఠంగా 354 హెచ్‌పీ శక్తిని, 500 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 8-స్పీడ్‌ ట్రిప్‌ట్రోనిక్‌ గేర్‌బాక్స్‌ను ఇవ్వడంవల్ల 4.8 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకుని గరిష్ఠంగా గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణించొచ్చు. డైనమిక్‌, కంఫర్ట్‌, ఎఫీషియెన్సీ, ఆటో, ఇండివిడ్యువల్‌ అనే ఐదు డ్రైవింగ్‌ మోడ్‌లు దీనిలో ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.