జాతీయం (National) వార్తలు (News)

అవార్డులు గెలుచుకున్న సినిమాలు

కేంద్రం 67వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. తెలుగులో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ ఉత్తమ చిత్రంగా, ఈ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన నవీన్ నూలికి ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో అవార్డులు గెలుచుకున్నారు. ‘ఉత్తమ ప్రజాదరణ, వినోదాత్మక చిత్రం’గా మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమాకు మరియు అదే సినిమాకు ఉత్తమ నృత్య దర్శకత్వం కేటగిరీలో రాజు సుందరానికి అవార్డులు దక్కాయి. ఇక ఉత్తమ నిర్మాణ సంస్థగా మహర్షి చిత్రాన్ని నిర్మించిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అవార్డు దక్కించుంది.

ఉత్తమ నటీనటులుగా కంగనా రనౌత్ (మణికర్ణిక, పంగా),‌ ధనుష్(అసురన్), మనోజ్ వాజపేయీ(భోంస్లే) లకు దక్కాయి. ఉత్తమ సహాయ నటి, సహాయనటుడు క్యాటగిరిలో విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)కి పల్లవి జోషి(ది తాష్కెంట్ ఫైల్స్)లకు అవార్డులు వచ్చాయి.

వివిధ భాషల్లో ఉత్తమ చిత్రాలు:
ఉత్తమ మలయాళ చిత్రం: కల్ల నొట్టం
ఉత్తమ మరాఠీ చిత్రం: బర్దో
ఉత్తమ తమిళ చిత్రం: అసురన్
ఉత్తమ హిందీ చిత్రం: చిచోరె
ఉత్తమ కన్నడ చిత్రం: అక్షి
ఉత్తమ ఒడియా చిత్రం: ససలా బుధార్ బదలా, కలిర అతితా
ఉత్తమ అస్సామీ చిత్రం: రొనువా
ఉత్తమ పంజాబీ చిత్రం: రబ్ ద రేడియ్ 2
ఉత్తమ బెంగాలీ చిత్రం: గుమ్నామీ
ఉత్తమ ఛత్తీస్‌గఢ్ చిత్రం: భులాన్ ది మేజ్

ఇతర విభాగాల్లో
ఉత్తమ దర్శకుడు: బహత్తర్ హూరెయిన్
ఉత్తమ సంగీత దర్శకత్వం(పాటలు): డి.ఇమాన్(విశ్వాసం)
ఉత్తమ కొరియోగ్రఫీ: రాజుసుందరం(మహర్షి)
ఉత్తమ గాయకుడు: బి.ప్రాక్ (తెరె మిట్టీమే పాట, కేసరి సినిమా నుంచి)
ఉత్తమ నేపథ్య సంగీతం: జ్యేష్టపుత్రో
మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్: సిక్కిం
బెస్ట్ బుక్ ఆన్ సినిమా: ఏ గాంధియన్ అఫైర్: ఇండియాస్ క్యూరియస్ పోర్ట్రేయల్ ఆఫ్ లవ్ ఇన్ సినిమా(సంజయ్ సూరి)
బెస్ట్ యానిమేషన్ ఫిలిం: రాధ(మ్యూజికల్)
బెస్ట్ ఎడ్యుకేషన్ ఫిలిం: యాపిల్స్ అండ్ ఆరెంజెస్(ఇంగ్లిష్)
బెస్ట్ ఫిలిం క్రిటిక్: సోహిని ఛటోపాధ్యాయ
బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: హోలీ రైట్స్(హిందీ), లాడ్లీ(హిందీ)
బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం: జక్కల్
చిత్రాలు అవార్డులను గెలుచుకున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.