అమెరికాకు చెందిన చమురు సంస్థ ‘ఆక్సిడెంటల్‌ పెట్రోలియం’ అనే సంస్థ వాతావరణంలో నానాటికీ పోగుపడుతున్న కార్బన్‌ డైఆక్సైడ్‌ వల్ల భూతాపం పెరగడంతో తలెత్తుతున్న దుష్ప్రభావాలను తగ్గించుకోవాలంటే గాల్లో నుంచి ఈ వాయువు పరిమాణాన్ని తగ్గించాల్సి ఉంటుందని, వాతావరణం నుంచి కార్బన్‌ డైఆక్సైడ్‌ను ఒడిసిపట్టే ఒక భారీ కర్మాగారానికి వచ్చే ఏడాది శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించింది. పర్యావరణానికి మేలు చేయడంతోపాటు డబ్బు సంపాదన కూడా దీని ఉద్దేశమన్నారు. నిజానికి ఆక్సిడెంటల్‌ సంస్థ గత 40 ఏళ్లుగా తన చమురు, గ్యాస్‌ కార్యకలాపాల నుంచి వెలువడుతున్న కార్బన్‌ డైఆక్సైడ్‌ను ఒడిసిపట్టి అలా సేకరించిన వాయువును నేలమాళిగలోకి ప్రవేశపెట్టడం ద్వారా చమురు క్షేత్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఇది దోహదపడుతుందని ఆ సంస్థ భావిస్తోంది. ప్రస్తుతమున్నకేంద్రాలకు ఏటా కొన్ని వేల టన్నుల సేకరణ సామర్థ్యం మాత్రమే ఉండడంతో ఏకంగా ఒక మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల మేర కార్బన్‌ డైఆక్సైడ్‌ను సేకరించే కర్మాగారాన్ని నిర్మించనుంది. ఆక్సిడెంట్‌ నిర్మించతలపెట్టిన ఫ్యాక్టరీ రసాయనాల సాయంతో గాల్లోని కార్బన్‌ డైఆక్సైడ్‌ను ఒడిసిపట్టి ఆ వాయువును నేలమాళిగలో భద్రపరచడం లేదా పారిశ్రామిక అవసరాలకు వినియోగించడం చేయవచ్చని వికీ చెప్పారు. ‘‘ఈ ప్రక్రియకు భారీగా ఖర్చవుతుందని పలువురు అంటున్నారు. అయితే సౌర, పవన విద్యుత్‌ తరహాలో కర్మాగారాల సంఖ్య పెరిగే కొద్దీ ధర తగ్గుతుంది’’ అని ఆ సంస్థకు సంబందించిన ఉద్యోగి ఒకరు తెలిపారు.