చెన్నై విమానాశ్రయానికి దుబాయి, షార్జా నగరాల నుంచి ఆదివారం వచ్చిన రెండు ప్రత్యేక విమానాలలో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. చెన్నై, తిరుచ్చి, రామనాథపురం, విళుపురం, సేలం జిల్లాలకు చెందిన ఏడుగురు వ్యక్తులపై అనుమానంతో ప్రత్యేకంగా సోదా చేయగా ముడి బంగారంతోపాటు తల విగ్గు, సాక్సుల్లో దాచిన బంగారం పేస్టును గుర్తించి మొత్తం రూ.2.53 కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఏడుగురిని అరెస్టు చేశారు. అదే సమయంలో చెన్నై నుంచి షార్జాకు అక్రమంగా తీసుకెళ్లేందుకు తెచ్చిన రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు.