జాతీయం (National) వార్తలు (News)

పింఛనుదారులకు ఊరట!

పింఛనుదారులు తమ పింఛన్లు పొందేందుకు సమర్పించే డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ ‘జీవన్‌ ప్రమాణ్‌’కు ఆధార్‌ ఉండాలన్న నిబంధన సడలించారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి పెన్షనర్లకు పంపే ‘యాప్‌’ సందేశాలకు, హాజరు నిర్వహణకు కూడా ఆధార్‌ పరిశీలన తప్పనిసరి కాకుండా, స్వచ్ఛంద వ్యవహారంగా ఉంటుంది. ప్రతినెలా పింఛన్లు పొందడంలో ఆధార్‌ కార్డులు, వేలిముద్రలకు సంబంధించి తాము పలు ఇబ్బందులు పడుతున్నామని పెన్షనర్ల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు పెద్దసంఖ్యలో అందడంవల్ల ఈ నిబంధన సవరించారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.