టెక్నాలజీ (Technology) వార్తలు (News)

యథాతథంగా ఏపీ ఎంసెట్‌-2021 ‌

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్‌ సహా వివిధ సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల ఏపీ ఎంసెట్‌-2021 ప్రవేశాలను పాత విధానంలోనే యథాతథంగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోందని తెలుస్తుంది. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ చదవాలంటే ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదవని ఇతర గ్రూపుల ఇంటర్‌ విద్యార్థులకూ ఇంజనీరింగ్‌ కోర్సుల్లోకి ప్రవేశాలు కల్పించేలా ఏఐసీటీఈ ఇటీవల నిబంధనలను విడుదల చేసింది. వీటికి అవసరమయ్యే కంప్యూటర్‌ సైన్స్, మెకానికల్, ఈసీఈ, సివిల్‌ ఇంజనీరింగ్‌ వంటి కోర్సులకు ఆ సబ్జెక్టులను తప్పనిసరి చేస్తూనే ఇతర కోర్సులకు ఇతర గ్రూపుల విద్యార్థులను అనుమతించాలని సూచించింది.

ఇందుకు 14 ఆప్షనల్‌ సబ్జెక్టులను పేర్కొంటూ వీటిలో ఏ మూడింటి కాంబినేషన్‌తో ఇంటర్‌ చదివినా ఇంజనీరింగ్‌ కోర్సుల్లోకి అనుమతించవచ్చని తెలిపింది. అయితే విద్యార్థులు ఇంటర్‌లో 45శాతం (రిజర్వుడ్‌ కేటగిరీలకు 40 శాతం) మార్కులు సాధించి ఉండాలి. కరోనా నేపథ్యంలో ఇంటర్‌ తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎంసెట్‌లో కూడా సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించనున్నారు. ఏయే అంశాలపై బోధన జరిగిందో అవే అంశాల పరిధిలో ప్రశ్నలుండేలా ఉన్నత విద్యామండలి జాగ్రత్తలు తీసుకుంటోందని అధీరవర్గాల సమాచారం.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.