ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ 1 నుంచి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు, అది కూడా ఉ.7.45 నుంచి 11.30 వరకు తరగతులు ఉంటాయని, ఆ తర్వాత మధ్యాహ్న భోజనం ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల పాఠశాలల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిబంధనల అమలు చేయడానికి మరియు తీవ్రమైన ఎండల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.