వార్తలు (News)

ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తం – మంగళగిరి

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో నిర్మాణాలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగానే అధికారులకు కూల్చివేతలకు ఒడిగట్టడంతో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. అక్రమ నిర్మాణాల పేరిట కొన్ని నివాసాలను అధికారులు ఈ ఉదయం పొక్లెయిన్‌లతో కూల్చేయడంతో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతలకు దారి తీసింది. బాధితులు అడ్డుకుంటున్నా వారిని పోలీసుల సాయంతో నిలువరించి కట్టడాలను పడగొట్టారు. తాము 40 ఏళ్లుగా ఇదే ప్రాంతంలోనే ఉంటున్నామని ఇళ్ల స్థలాలు కేటాయించకుండా తమ కట్టడాలను ఎలా తొలగిస్తారని బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులకు తెలుగుదేశం, వామపక్ష నేతలు మద్దతుగా నిలిచి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాకే ఖాళీ చేయించాలని డిమాండ్‌ చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.