గుంటూరుకు చెందిన దేవి నాగమ్మ(19) తన ఇద్దరు అక్కలతో కలిసి ప్రకాష్‌నగర్‌లో నివాసముంటోంది. ఆమెకు భక్తి ఎక్కువ. ఆమెకు ప్రతీ సోమవారం ఉపవాసం చేసే అలవాటు ఉండగా ఆమె రెండో అక్క ఈ నెల 9న ఆరోగ్యం క్షీణిస్తుందంటూ ఆమెను మందలించడంతో మనస్తాపానికి గురై సోదరితో ఘర్షణ పడి ఇంట్లో ఉరేసుకుంది. అప్పుడే వచ్చిన పెద్దక్క, బావ కొన ఊపిరితో ఉన్న ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి అయిదురోజుల చికిత్సనుండి చికిత్స అందిస్తున్నారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆమె మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ పి.శ్రీనివాస్‌రావు‌ చెప్పారు.