నందిగామ మండలం మాగల్లుకు చెందిన రైతులు కోతకొచ్చిన రెండు క్వింటాళ్ల బెండ కాయలకు కిలోకి రూ.6 కూడా గిట్టుబాటు కాకపోవడం, తీసుకెళ్లిన సరకునంతా వ్యాపారులు కొనే పరిస్థితి లేకపోవడంతో గ్రామంలో ఉచితంగా పంపిణీ చేశారు.తాళ్లూరి వాసు, తాళ్లూరి శ్రీనివాసరావు ఆదివారం ఇలా ఒక చోట కూరగాయలను పెట్టడంతో గ్రామస్థులు తీసుకెళ్తున్నారు.