వార్తలు (News)

జల కళతో పొంగి పొర్లుతున్న బుక్కపట్నం చెరువు!!

అనంతపురం జిల్లాకు కరవు సీమగా పేరుంది. ఆ ప్రదేశంలో జలాశయాలు నిండడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. జిల్లాలోనే పెద్దదిగా పేరొందిన బుక్కపట్నం చెరువును గత రెండేళ్లు హంద్రీనీవా జలాలతో నింపారు. ప్రస్తుతం కురిసిన వర్షాలకు చిత్రావతి నది పొంగిపొర్లింది. చెరువుకు భారీగా వర్షపు నీరు చేరడంతో పూర్తి స్థాయిలో నిండింది. దీనికింద 6 వేల ఎకరాల ఆయకట్టు ఉండడంతో ఇప్పటికే వరినాట్లు వేశారు. దీంతో ఆ ప్రాంతమంతా పచ్చగా.. కోనసీమను తలపిస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •